ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి
Tips for Healthy Pregnancy | గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
› గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. తొందరపాటు లేకుండా, నిదానంగా నమిలి మింగాలి.
› రాత్రి పడుకునే సమయానికి రెండు గంటల ముందే భోజనం అయిపోవాలి. అలసట తీరేందుకు వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి.
› గర్భంలో బిడ్డకు మరింత చోటు సమకూర్చడానికి శరీరం కండరాల్ని సడలించడం వల్ల వెన్ను నొప్పులు వస్తుంటాయి. గర్భస్థ శిశువు పెరిగే కొద్దీ మూత్రాశయం మీద ఒత్తిడి అధికం
అవుతుంది. కాబట్టి, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలి.
› మడమలు, కాళ్లకు శక్తినిచ్చే వ్యాయామాల వల్ల రక్త సరఫరా మెరుగుపడి తిమ్మిర్లు తగ్గుతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు.
› వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, గుండెలో మంట తదితర సమస్యలు తగ్గుతాయి. నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. పాలు, పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్నే ఎంచుకోవాలి. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులూ వేసుకోకూడదు.
Read More :
“Pregnant after 40 | నలభైలలో పిల్లలు పుట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?”
“Pregnancy doubts | ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువైతే ఆడపిల్ల పుడుతుందా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- health tips
- pregnancy
- Pregnant
RELATED ARTICLES
తాజా వార్తలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

