Health Tips | డెలివరీ తర్వాత పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి?
హలో డాక్టర్. నా వయసు ఇరవై ఎనిమిది. ప్రస్తుతం ఆరో నెల. మా కజిన్‌కు రెండేండ్ల క్రితం డెలివరీ అయ్యింది. ఆమెది సిజేరియన్. కాన్పు అయ్యాక కూడా పొట్ట అలానే ఎత్తుగా ఉండిపోయింది. ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
Health Tips | హలో డాక్టర్. నా వయసు ఇరవై ఎనిమిది. ప్రస్తుతం ఆరో నెల. మా కజిన్‌కు రెండేండ్ల క్రితం డెలివరీ అయ్యింది. ఆమెది సిజేరియన్. కాన్పు అయ్యాక కూడా పొట్ట అలానే ఎత్తుగా ఉండిపోయింది. ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. నా విషయంలో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
-ఓ సోదరి
గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన నిర్లక్ష్యమే కారణం. సిజేరియన్, సాధారణ ప్రసవం.. ఏదైనా సరే బిడ్డ పుట్టిన ఆరు వారాల తర్వాత నుంచి వ్యాయామాలు ప్రారంభించాలి. పొత్తి పొట్టకు సంబంధించిన వివిధ ఎక్సర్సైజులు ఇప్పుడు యూట్యూబ్‌లాంటి మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. మంచి ట్రెయినర్ సాయంతోనూ ఈ వ్యాయామాలు చేయవచ్చు. యోగా కూడా పొట్ట యథాస్థితికి చేరేందుకు సాయపడుతుంది. కొంతమంది డెలివరీ అయ్యాక బెల్టువాడాం, పొట్ట తగ్గలేదని చెబుతుంటారు. బెల్టు అనేది పొట్ట కండరాలకు సపోర్ట్‌గా ఉంటుంది. దానివల్ల తగ్గే అవకాశమే లేదు. ఒక్క వ్యాయామంతోనే పురిటి తర్వాత పొట్టను తగ్గించుకోగలరు. అంతేకాదు, చక్కని పోషకాహారమూ తీసుకోవాలి.
-డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

