Apple Watch | యాపిల్ వాచ్ వల్ల తను గర్భవతి అని తెలుసుకున్న యువతి!
Apple Watch | ఇటీవల విడుదలైన కొత్త యాపిల్ వాచ్‌లో రీడింగ్ వల్ల తను గర్భవతి అని ఒక యువతికి తెలిసింది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో వెలుగు చూసిందీ ఘటన.
ఇటీవల విడుదలైన కొత్త యాపిల్ వాచ్‌లో రీడింగ్ వల్ల తను గర్భవతి అని ఒక యువతికి తెలిసింది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో వెలుగు చూసిందీ ఘటన. స్థానికంగా నివశించే ఒక 34 ఏళ్ల యువతికి యాపిల్ వాచ్ పెట్టుకొని పడుకోవడం అలవాటు. అలా చేస్తుంటే.. ఒక రోజు ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది.
ఇటీవలి కాలంలో ఆమె నిద్రపోతున్న సమయంలో కూడా హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటోందని ఆ నోటిఫికేషన్లో ఉంది. దీన్ని ఆమె వివరిస్తూ ‘అంతకుముందు నేను నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉండేది. కానీ అది 72కు పెరిగిందని యాపిల్ వాచ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది చిన్న మార్పే కానీ ఇలా గత 15 రోజులుగా జరుగుతోందని ఆ నోటిఫికేషన్లో ఉంది’ అని ఆమె తన సోషల్ మీడియాల ఖాతాలో రాసుకొచ్చింది.
దీంతో అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే తను గర్భవతి అని తెలిసిందని, తన కన్నా ముందే యాపిల్ వాచ్‌కు ఈ వార్త తెలిసిపోయిందని ఆమె పేర్కొంది. ఒకవేళ ఈ వాచ్ లేకపోతే తనకు అసలు అనుమానవే వచ్చేది కాదని ఆమె తెలిపింది. కాగా, కొత్తగా యాపిల్ కంపెనీ విడుదల యాపిల్వాచ్లలో సరికొత్త ఫీచర్లను ఆ కంపెనీ తీసుకొచ్చింది. ముఖ్యంగా యూజర్ల ఆరోగ్యంపై ఈసారి యాపిల్ కంపెనీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హార్ట్ రేట్ మానిటర్. టెంపరేచర్ సెన్సర్ వంటి వాటిని ఈ వాచ్‌లలో పొందుపరిచిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

