Health Tips | వంటింటి ఔషధం వెల్లుల్లితో ఆరోగ్యానికి మేలు
భారత్‌లో వెల్లుల్లి లేని వంటిల్లు కనిపించదు. వంటకాలకు రుచిని జోడించేందుకు మనం ఏండ్ల తరబడి వెల్లుల్లిని (Health Tips) వాడుతున్నాం.
న్యూఢిల్లీ : భారత్‌లో వెల్లుల్లి లేని వంటిల్లు కనిపించదు. వంటకాలకు రుచిని జోడించేందుకు మనం ఏండ్ల తరబడి వెల్లుల్లిని (Health Tips) వాడుతున్నాం. వెల్లుల్లితో రుచి, ఫ్లేవర్‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పలు అనారోగ్యాలకు వెల్లుల్లిని ఔషధంగా వాడుతుంటారు.
వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్ధం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు తక్కువ క్యాలరీలతోనే అత్యధిక పోషకాలను అందిస్తుంది. వెల్లుల్లి రోజూ తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించే వెల్లుల్లి యాంటీబయాటిక్గానూ పనిచేసి ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. డిమెన్షియా, అల్జీమర్స్ ముప్పును వెల్లుల్లి తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శక్తిని ఇనుమడింపచేసే ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయని, పూర్వం శక్తిపుంజుకునేందుకు అథ్లెట్లు వీటిని తినేవారని చెబుతారు. మెరుగైన డీటాక్స్గా కూడా వెల్లుల్లి పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
Read More :
Feet health | పాదాల్లో పగుళ్లు వేధిస్తున్నాయా…..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

