శృంగారం ఒక సృష్టి కార్యం..! సృష్టి కార్యం మాత్రమే కాదు.. అద్భుతమైన కావ్యం కూడా..! ఆ కావ్యంలో లెక్కలేనన్ని పేజీలు..! ఆ పేజీలన్నీ చదివి ఆస్వాదించడానికి జీవిత కాలం సరిపోదు..! ఒక్కో పేజీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది..! అందుకే ఎంత చదివినా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది..! శృంగారం కావ్యమే కాదు.. మహత్తరమైన క్రీడ కూడా..! అయితే ఈ క్రీడపై ఆశ, ఆరాటం ఉంటే సరిపోదు.. అవగాహన కూడా చాలా ముఖ్యం..! శృంగార క్రీడలో ఎంత తొందరపడితే అంత తొందరగా బొక్కబోర్లా పడటం ఖాయం..! అందుకే సమరంలో కంటే సరసంలో సహనం ముఖ్యమని వాత్సాయనుడు చెప్పాడు..! మరి శృంగారంలో సహనం పాటించగలగాలంటే ధృడమైన మనస్తత్వం కావాలి. మానసిక ధృడత్వంతోపాటు శారీరక పటుత్వం కూడా శృంగారానికి చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలకు శారీరక పటుత్వాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయి. మరి ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం
సాధారణంగా అల్లం టీ తాగితే శరీరంలోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే వంటల్లో అల్లం ఉపయోగిస్తుంటారు. అల్లం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. వంటకు రుచిని కూడా ఇస్తుంది. పడక గదిలో మగాడి పటిమను కూడా ఈ అల్లం టీ పెంచుతుంది. రోజూ ఒక చెంచాడు అల్లం రసం తీసుకుంటే వీర్య వృద్ధి కూడా జరిగి, సంతానలేమీ సమస్యలు తొలగిపోతాయి.
ఇంగువ-బెల్లం
ప్రతిరోజూ ఇంగువతోపాటు బెల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల మగతనం ఇనుమడిస్తుంది. శృంగార సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇంగువలో ఉండే పోషకాలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా ఉపయోగపడుతాయి. బెల్లం మాత్రం ఆడ, మగ ఇద్దరిలోనూ లైంగిక సాఫల్యతకు తోడ్పడుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం ఉంది. పడకగదిలో ఊరికెనే తేలిపోయే పురుష పుంగవులకు ఈ వెల్లుల్లి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నిత్యం వంటల్లో వాడటంతోపాటు అప్పుడప్పుడు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడంవల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతాన లేమి సమస్యలు కూడా తొలగిపోతాయి.
మునక్కాయలు
మునక్కాయలు తింటే మగాడిలో మగసిరి మీసం మెలేస్తుందనేది అక్షరసత్యం. మునక్కాయల్లో ఉండే జింక్ లైంగిక సామర్థ్యం పెరుగడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా మునక్కాయల్లో కాల్షియం, ఐరన్ కూడా ఉండటంవల్ల ఎముకల ధృడత్వానికి తోడ్పడుతుంది. అందుకే చిన్నపిల్లలతోపాటు గర్భిణిలకు కూడా మునక్కాయలు ఆహారంగా ఇస్తే మంచిది.
సోంపు
సోంపును సాధారణంగా జీర్ణశక్తిని పెంచుకోవడం కోసం ఉపయోగిస్తుంటాం. అందుకే భోజనం చేసిన తర్వాత నోట్లో సోంపు వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, జీర్ణశక్తిని పెంచే ఈ సోంపే శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. రోజుకి రెండు సార్లు చెంచాడు సోంపు నోట్లో వేసుకుంటే చాలు లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్యలు ఉంటే కూడా క్రమంగా తొలిగిపోతాయి.