Health Tips | సగ్గు బియ్యంతో చాలా లాభాలున్నాయ్.. వేసవి తాపం నుంచీ తక్షణ ఉపశమనం
Health Tips | సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనం శరీరం తక్షణమే ఉత్తేజితమవుతుంది. ముఖ్యంగా వేసవిలో అలసట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇవేగాక ఈ సగ్గు బియ్యంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.
మన శరీరానికి ఎంతో మేలుచేసే పదార్థాల్లో సగ్గు బియ్యం (Saggu Biyyam) కూడా ఒకటి. ఈ సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనం 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని తీసుకుంటే 355 క్యాలరీలు, 94 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లభిస్తాయి. అందుకే సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనం శరీరం తక్షణమే ఉత్తేజితమవుతుంది. ముఖ్యంగా వేసవిలో అలసట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇవేగాక ఈ సగ్గు బియ్యంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!
సగ్గు బియ్యంతో ప్రయోజనాలు..
1. సగ్గు బియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి. వీటిని పాలు, చక్కెర పోసి పాయసంలా వండుకుని తింటే చలువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.
2. వేసవి కాలంలో కొంచెం పనిచేసినా త్వరగా అలసిపోతాం. శరీరంలో శక్తి త్వరగా తగ్గిపోతుంది. అలాంటి వారు సగ్గుబియ్యం తిసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది.
3. ఊబకాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలు సమతాస్థితిలో ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమేగాక బరువు కూడా తగ్గుతారు.
4. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయట పడవచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలకు కూడా సగ్గు బియ్యంతో పరిష్కారం లభిస్తుంది.
5. విరేచనాలు అయినప్పుడు సగ్గు బియ్యం తీసుకుంటే తక్షణమే ఫలితం కనిపిస్తుంది. జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
6. సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి. విటమిన్ K ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
7. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీని కంట్రోల్ చేయడంతోపాటు బ్లడ్ కొలెస్టరాల్ను తగ్గిస్తుంది.
8. సగ్గుబియ్యంలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. కాబట్టి రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips | నల్ల క్యారెట్లతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..?
Health Tips | ప్రతి చిన్న పనికి అలసిపోతున్నారా.. అయితే మీ కూరల్లో ఇది తప్పక ఉండాల్సిందే
Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే భయపడుతున్నారా.. అయితే మీరు ఇది చదవాల్సిందే
Health Tips | వ్యాయామానికి ముందు, తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

