Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు
Beuty Tips | కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు.
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్‌లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. అలాంటి వారి కోసం బ్యూటీ ఎక్స్పర్ట్స్ కూడా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందామా..?
బ్యూటీ టిప్స్ (Beauty Tips)
నిగనిగలాడే చర్మం కోసం..
1. చర్మం చిట్లిపోయి బిరుసెక్కినట్టుగా, అసౌకర్యంగా అనిపిస్తే ఒంటికి పెరుగు రాసుకుని, అరగంట తర్వాత స్నానం చేయాలి. దాంతో చర్మం మెత్తబడి నాజూగ్గా మారుతుంది.
2. కొందరికి యుక్త వయసులో కూడా చర్మం మీద ముడతలు వచ్చి ఇబ్బంది పెడుతాయి. ఇలాంటి ముడుతలు పోవాలంటే కొన్ని రోజులపాటు ప్రతిరోజూ ఉదయాన్నే చేమంతి పూలతో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఫలితం కనిపిస్తుంది.
కేశాల నిగారింపు కోసం..
1. జుట్టు నిగారింపుతో మెరవాలంటే కోడిగుడ్డు సొన, అరటి పండు గుజ్జు బాగా కలిపి ఆ పేస్టును తలకు పట్టించి పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
2. జుట్టు బిరుసుగా ఉండి దువ్వుకోవడానికి వీలులేకుండా అయితే కొంచం నిమ్మరసం తలకు రాసుకోవాలి. ఆ తర్వాత దువ్వితే జట్టు ఎటంటే అటు మెత్తగా వంగుతుంది.
3. ఎరుపు రంగులో ఉన్న జుట్టు నల్లగా మారాలన్నా, తల వెంట్రుకలు రాలడం తగ్గాలన్నా ఒక వంతు యాపిల్ జ్యూస్, మూడు వంతుల నీళ్లు కలిపి తలకు రాసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి.
అందమైన పెదాల కోసం..
1. పెదవులు తరచూ ఎండిపోతున్నా, పగుళ్లు ఏర్పడుతున్నా పాలమీగడను, కుంకుమ పువ్వును బాగా కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పెదవులకు రాసుకోవాలి. ఈ విధంగా వారం, పదిరోజులు చేస్తే మీ పెదవులు గులాబీ రంగులోకి మారి అందంగా ఉంటాయి.
2. తేనెను, నిమ్మరసాన్ని గ్లిసరిన్‌లో కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసుకుని మర్దన చేస్తే పెదాల నల్లదనం పోతుంది. గులాబీ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి.
3. పెదవులపైన మచ్చలు పోవాలంటే గ్లిసరిన్‌లో కొంచెం రోజ్ వాటర్ కలిపి దానిని పెదాలకు మర్దన చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips | మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు, బరువు తగ్గొచ్చు.. బొబ్బర్లతో బోలెడు లాభాలు
Beauty Tips | చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

