Health Tips | మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు, బరువు తగ్గొచ్చు.. బొబ్బర్లతో బోలెడు లాభాలు
Health Tips | బొబ్బర్లు (Bobbarlu) (అలసందలు (Alasandalu)) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి. మరి బొబ్బర్లతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయో తెలుసుకుందామా..?
బొబ్బర్లు (Bobbarlu) (అలసందలు (Alasandalu)) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి. మరి బొబ్బర్లతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయో తెలుసుకుందామా..?
బొబ్బర్లతో ఇవీ ప్రయోజనాలు..
1. అధిక బరువుతో బాధపడే వారికి బొబ్బర్లు మంచి ఉపయోగకరమైన ఆహారం. బొబ్బర్లలో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
2. మధుమేహులకు లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
3. బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల పోషకాహార లోపంతో వచ్చే కొన్నిరకాల వ్యాధులు ధరిచేరవు. ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
4. బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అంతేగాక హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి.
5. అదేవిధంగా బొబ్బర్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
6. బొబ్బర్లలోని అధిక ప్రొటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Beauty Tips | చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Cucumber | ఎండాకాలంలో దొరికే కీరదోసను తొక్క తీసి తినడం మంచిదేనా?
Health Tips | మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారా.. అయితే ఈ పండు మీకు చక్కటి పరిష్కారం..!
Health Tips | నిమ్మకాయతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం.. ఎలాగో తెలుసా..?
Health tips | వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

