Health Tips | నిమ్మకాయతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం.. ఎలాగో తెలుసా..?
Health Tips | నిమ్మకాయ..! ఇది సిట్రస్ జాతికి చెందిన ఒక రకం కాయ..! ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి ఔషధంగా, అందాన్ని ఇనుమడింపజేసే ఆయుధంగా పనిచేస్తుంది. అంతేగాక నిమ్మకాయతో ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
నిమ్మకాయ (Lemon)..! ఇది సిట్రస్ జాతికి చెందిన ఒక రకం కాయ..! ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి ఔషధంగా, అందాన్ని ఇనుమడింపజేసే ఆయుధంగా పనిచేస్తుంది. అంతేగాక నిమ్మకాయతో ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎండా కాలంలో ఒంట్లో వేడిని తగ్గించడానికి, అలసిపోయిన దేహానికి తక్షణమే హుషారు తెప్పించడానికి నిమ్మ తోడ్పడుతుంది. రుచికరమైన పులిహోర చేసుకోవడానికి, కమ్మటి తొక్కు పెట్టుకోవడానికి కూడా నిమ్మకాయలు ఉపయోగపడుతాయి. ఇలా చెప్పుకుంటూపోతే నిమ్మతో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో చూద్దామా..!
నిమ్మకాయతో లాభాలు (Lemon benefits)..
1. నిమ్మకాయలు సీజనల్ రోగాలు ధరిచేరకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ నిమ్మరసం (Lemon juice) తాగడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు.
2. నిమ్మరసం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మలో కావాల్సినంత సి విటమిన్ లభిస్తుంది. తరచూ నిమ్మరసం తీసుకునే వారిలో వయసు పెరుగుతున్నా చర్మం అంత త్వరగా ముడుతలు పడదు. దీంతో వృద్ధాప్య చాయలు త్వరగా దరిచేరవు.
3. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వస్తుంది.
4. పంటినొప్పిని తగ్గించడంలో కూడా నిమ్మరసం తోడ్పడుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ పంటిలోని కణజాలాన్ని మొద్దుబారేలా చేస్తుంది. అదేవిధంగా చిగుళ్లలోంచి రక్తం వచ్చేవారు తరచూ నిమ్మరసం తీసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుంది.
5. కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొలగించి, శుద్ధి చేయడంలో కూడా నిమ్మరసం మంచి ఉపకారిగా పనిచేస్తుంది.
6. వేసవిలో నిమ్మరసం తాగితే అలసట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
7. స్థూలకాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.
8. అంతేగాక నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించడంలో తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health tips | వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్.. ఎందుకో తెలుసా..?
Health Tips | PCOS, PCOD సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టేయొచ్చు.. పరిశోధనలో కీలక విషయాలు
Prediabetes symptoms | మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ పరీక్షలు చేయంచుకోండి
Feet health | పాదాల్లో పగుళ్లు వేధిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

