Health tips | వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్.. ఎందుకో తెలుసా..?
Health tips | బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఆస్తమా లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా, ఇప్పటికే అలాంటి అనారోగ్యాలు ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ కలర్ రైస్, బ్రౌన్ కలర్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా బ్రౌన్ కలర్ షుగర్ (Brown Colour Sugar)ను కూడా వైద్య నిపుణులు రిఫర్ చేస్తున్నారు.
బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఆస్తమా లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా, ఇప్పటికే అలాంటి అనారోగ్యాలు ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ కలర్ రైస్, బ్రౌన్ కలర్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా బ్రౌన్ కలర్ షుగర్ (Brown Colour Sugar)ను కూడా వైద్య నిపుణులు రిఫర్ చేస్తున్నారు. బ్రౌన్ రంగు చక్కెరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి బ్రౌన్ కలర్ షుగర్‌లో ఉన్న గొప్పతనం ఏమిటో..? బ్రౌన్ షుగర్‌ను వినియోగించడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
బ్రౌన్ షుగర్‌ను ఎలా సేకరిస్తారు..?
వైట్ షుగర్ కంటే బ్రౌన్ రంగు షుగర్ (Brown sugar)లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక వైట్ షుగర్ ఎక్కువగా తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కానీ, బ్రౌన్ షుగర్‌ను చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రౌన్ షుగర్‌లో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి మంచివి.
బ్రౌన్ షుగర్‌తో ప్రయోజనాలు..
1. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి.
2. అదేవిధంగా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లను తగ్గించడానికి బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి తిమ్మిర్లతోపాటు నొప్పిని తగ్గిస్తుంది.
3. బ్రౌన్ షుగర్‌లో కేలరీలు తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది.
4. అదేవిధంగా బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోతెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి. అలాగే చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‌గా పనిచేస్తాయి.
5. బ్రౌన్ షుగర్ యాంటీ అలర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చికిత్సలో సాయపడుతుంది.
బ్రౌన్ షుగర్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips | PCOS, PCOD సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టేయొచ్చు.. పరిశోధనలో కీలక విషయాలు
Prediabetes symptoms | మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ పరీక్షలు చేయంచుకోండి
Feet health | పాదాల్లో పగుళ్లు వేధిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Ectopic Pregnancy | ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకొస్తుంది? ఇది అంత ప్రమాదమా?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

