Health Tips | PCOS, PCOD సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టేయొచ్చు.. పరిశోధనలో కీలక విషయాలు
Health Tips | పోషకాహారం తీసుకునే వారిలో PCOS, PCOD సమస్యలు తగ్గుముఖం పట్టడమేగాక, బరువు కూడా తగ్గుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అంతేగాక మహిళలు తరచూ కొన్ని రకాల గింజలు తీసుకోవడంవల్ల హార్మోన్లు సమంగా విడుదలై సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి ఆ గింజలు ఏమిటో తెలుసుకుందామా..?
పాలిసిస్టైన్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఓవరీ డిసీజ్ (PCOD) అనేవి ఈ రోజుల్లో మహిళల్లో సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది మహిళల్లో ఇన్సులిన్ నిరోధం కారణంగా ఈ సమస్యలు వస్తున్నట్లు తేలింది. ఇన్సులిన్ నిరోధంవల్ల హార్మోన్ల విడుదలలో అసమతుల్యత ఏర్పడి, చక్కెరల వినియోగం ఎక్కువ జరగక షుగర్ లెవల్స్ పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే పోషకాహారం తీసుకునే వారిలో ఈ PCOS, PCOD సమస్యలు తగ్గుముఖం పట్టడమేగాక, బరువు కూడా తగ్గుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అంతేగాక మహిళలు తరచూ కొన్ని రకాల గింజలు తీసుకోవడంవల్ల హార్మోన్లు సమంగా విడుదలై సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి ఆ గింజలు ఏమిటో తెలుసుకుందామా..?
1. చియా గింజలు
చియాగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మనిషి శరీర బరువు తగ్గడానికి, రక్తంలో షుగర్ లెవల్స్ మెరుగుపడటానికి తోడ్పడుతాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో సమస్యను తగ్గించడానికి కూడా ఈ చియా గింజలు తోడ్పడుతాయి.
2. పొద్దుతిరుగుడు గింజలు
పొద్దుతిరుగుడు గింజల్లో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ నిర్విషీకరణకు తోడ్పడి హార్మోన్ల సక్రమ విడుదలకు దోహదం చేస్తుంది. అంతేగాక ఫ్యాట్ కంటెంట్ కూడా పొద్దు తిరుగుడులో చాలా ఎక్కువ. యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలుంటాయి. పైగా ఫైబర్లు, ప్రొటీన్లు కూడా ఈ పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి.
3. గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే గుమ్మడి గింజలను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల మోనోపాజ్ తర్వాత మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడే రిస్క్ తగ్గుతుంది.
4. అవిసె గింజలు
అవిసె గింజల్లో ఒమేగా-3 ALA, ఫైబర్ కంటెంట్ కావాల్సినంత ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతాస్థితిలో ఉంచడానికి తోడ్పడుతాయి. PCOS, PCOD సమస్యలవల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను కూడా నిరోధిస్తాయి. అదేవిధంగా శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అంతేగాక సంతాన సాఫల్యతను కూడా పెంచుతాయి.
5. నువ్వు గింజలు
నువ్వు గింజల్లో కాల్షియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ప్రొటీన్లు కూడా ఈ నువ్వు గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమానతలను క్రమబద్దీకరించడంలో బాగా ఉపయోగపడుతాయి.
6. జనుము గింజలు
జనుము గింజల్లో GLAగా పిలిచే ఒక రకమైన ఒమేగా-6 ఫ్యాట్ ఉంటుంది. హార్మోన్లను క్రమతాస్థితిలో ఉంచడానికి ఇవి తోడ్పడుతాయి. వీటిలో ఫైటో కాంపౌండ్స్ కూడా విరివిగా ఉంటాయి. ఇవి మహిళల్లో మోనోపాజ్ దశలో వచ్చే దుష్ప్రభావాలను నిరోధిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Prediabetes symptoms | మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ పరీక్షలు చేయంచుకోండి
Feet health | పాదాల్లో పగుళ్లు వేధిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Ectopic Pregnancy | ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకొస్తుంది? ఇది అంత ప్రమాదమా?
Health Tips | వంటింటి ఔషధం వెల్లుల్లితో ఆరోగ్యానికి మేలు
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

