Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Health Tips | గాలి, నీరు, ఆహారం లాగే జీవికి శృంగారం కూడా ముఖ్యమైన అవసరాల్లో ఒకటి. శృంగారంవల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. వీటన్నింటికి మించి శృంగారంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంపతులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారట.
గాలి, నీరు, ఆహారం లాగే జీవికి శృంగారం కూడా ముఖ్యమైన అవసరాల్లో ఒకటి. శృంగారంవల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. వీటన్నింటికి మించి శృంగారంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంపతులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారట. ఎందుకంటే నిత్య శృంగారంవల్ల శరీరాలకు వ్యాయామం అవుతుందట. పైగా శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయట. అందుకే నిత్యం శృంగారాన్ని ఆస్వాదించే దంపతులకు వైద్యుల అవసరమే రాదట. మరి నిత్య శృంగారం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనేలేమిటో, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా..?
ఇవండీ ప్రయోజనాలు..
1. రోజూ శృంగారంలో పాల్గొనడంవల్ల హార్మోన్ల ప్రభావంతో మానసిక ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుందట.
2. నిత్య శృంగారంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే శృంగారంతో శారీరక సంతృప్తి మాత్రమేగాక ఒంట్లో యాంటీబాడీస్ సంఖ్యపెరుగుతుందట. ఇవి శరీరం వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియాలను ఎదుర్కోవడంలో తోడ్పడుతాయట.
3. ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే నిత్య శృంగారంవల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయట. యూరిన్ లీకేజీలాంటి సమస్య ఉంటే తక్షణమే తగ్గిపోతుందట.
4. నిత్య శృంగారంవల్ల గుండెపోటు రిస్క్ కూడా తగ్గుతుందట. సాధారణంగా హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడంవల్ల హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శృంగారంవల్ల శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయట. దాంతో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందట.
5. అంతేగాక నిత్యం శృంగారంలో పాల్గొనే జంటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయట. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తారట. అదేవిధంగా నిత్య శృంగారం చేసేవారిలో ఎనర్జీ లెవెల్స్కూడా ఎక్కువగా ఉంటాయట. శరీరం చురుగ్గా పనిచేస్తుందట.
6. నిద్రలేమి సమస్యకు కూడా నిత్య శృంగారం చక్కని పరిష్కార మార్గమట. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడంవల్ల విడుదలయ్యే హార్మోనలతో నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుందట. శరీరం రిలాక్స్‌గా ఉంటుందట.
ఇవి కూడా చదవండి..
Cucumber | ఎండాకాలంలో దొరికే కీరదోసను తొక్క తీసి తినడం మంచిదేనా?
Health Tips | మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారా.. అయితే ఈ పండు మీకు చక్కటి పరిష్కారం..!
Health Tips | నిమ్మకాయతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం.. ఎలాగో తెలుసా..?
Health tips | వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

