Health Tips | ప్రతి చిన్న పనికి అలసిపోతున్నారా.. అయితే మీ కూరల్లో ఇది తప్పక ఉండాల్సిందే
Health Tips | ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా సాయపడుతుంది. ప్రకృతిసిద్ధంగా లభించే చెట్ల ద్వారా మనకు ఆహారంతోపాటు వివిధ ఔషధాలు కూడా లభిస్తాయి. కొన్ని రకాల మొక్కలైతే అటు ఆహారంగా, ఇటు ఆరోగ్యానికి రెండు విధాలుగా తోడ్పడుతాయి.
ప్రకృతి (Nature) మనకు ఎన్నో విధాలుగా సాయపడుతుంది. ప్రకృతిసిద్ధంగా లభించే చెట్ల ద్వారా మనకు ఆహారం (Food)తోపాటు వివిధ ఔషధాలు (Medicine) కూడా లభిస్తాయి. కొన్ని రకాల మొక్కలైతే అటు ఆహారంగా, ఇటు ఆరోగ్యానికి రెండు విధాలుగా తోడ్పడుతాయి. అలాంటి వాటిలో మునగ కూడా ఒకటి. మునగాకు (Munagaku)ను ఆకు కూరగానో, పప్పులో కలెగూరగానో లేదంటే పచ్చడిగానో చేసుకుని తినడంవల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మరి మునగాకుతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామా..?
ఇవీ ప్రయోజనాలు..
1. వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వినియోగించడంవల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు.
2. పాలకూరతో పోలిస్తే మునగాకులో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఇనుము, మెగ్నీషియం మనకు శక్తినిస్తాయి. ఊరికనే అలసటకు గురికాకుండా కాపాడుతాయి.
3. మునగాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుకే మునగాకును నిత్యం ఆహారంలో వినియోగిస్తే అతిగా తినడం అనే సమస్య ఉండదు.
4. మునగాకులో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.
5. మునగలోని విటమిన్-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మునగాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే భయపడుతున్నారా.. అయితే మీరు ఇది చదవాల్సిందే
Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు
Health Tips | మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు, బరువు తగ్గొచ్చు.. బొబ్బర్లతో బోలెడు లాభాలు
Beauty Tips | చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

