Health Tips | కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఇవి ట్రై చేయండి!
Health Tips | మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్, బ్లడ్ కొలెస్టరాల్, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. దాంతో ప్రజల్లో క్రమంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది.
మధుమేహం (Blood Sugar), అధిక రక్తపోటు (High blood pressure), థైరాయిడ్, బ్లడ్ కొలెస్టరాల్, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. దాంతో ప్రజల్లో క్రమంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది. ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం మంచిది..? ఎలాంటి ఆహారం హాని చేస్తుంది..? అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ద్వారా చిరుధాన్యాలే (Millets) అన్నింటికంటే ఉత్తమం అనే నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఇప్పుడు చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. రాగులు, సజ్జలు, ఊదలు, సామలు, అరికెలు, కొర్రలు లాంటి చిరుధాన్యాలు ప్రస్తుతం ప్రతి ఇంట్లో దర్శనమిస్తున్నాయి.
ఇవీ లాభాలు..
1. చిరుధాన్యాలు చూడటానికి చిన్నగానే ఉంటాయిగానీ ఇవి పోషకాల గనులు. ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాల వంటి అత్యవసర పోషకాలెన్నో ఈ చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి.
2. చిరుధాన్యాల్లో మేలురకం పిండి పదార్థాలు ఉండటంవల్ల జీర్ణక్రియ నియంత్రణకు కూడా బాగా తోడ్పడతాయి. చిరుధాన్యాలను తీసుకోవడంవల్ల చాలాసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి అనిపించదు. దాంతో బరువు అదుపులో ఉంటుంది.
3. ముఖ్యంగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు ఎముకల పుష్టికి కూడా తోడ్పడతాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి.
4. కీళ్ల సమస్యలతో బాధపడేవారు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే వాటిలో పిండి పదార్థం ఎక్కువ. కానీ చిరుధాన్యాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎముకల బలోపేతానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.
5. రాగులు, సజ్జల్లో వాపును నివారించే గుణం ఉంటుంది. అందువల్ల కీళ్లలో వాపు తగ్గుతుంది. దాంతో కీళ్లు అరగడంవల్ల తలెత్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి.
6. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల రాగుల్లో 244 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అందువల్ల ఎముకలు క్షీణించటం, విరిగిపోవడం లాంటి ముప్పు తగ్గుతుంది.
7. సజ్జల్లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువ. ఇది క్యాల్షియంతో కలిసి ఎముకలు బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 296 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్ ఉంటాయి.
8. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రాగులు, సజ్జలను ఆహారంలో విధిగా చేర్చుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాగి, సజ్జ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. రాగి పిండితో జావ చేసుకుని తాగొచ్చు. రాగి జావలో కొంచెం బెల్లం కలిపితే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు.
ఇవి కూడా చదవండి..
Health Tips | సగ్గు బియ్యంతో చాలా లాభాలున్నాయ్.. వేసవి తాపం నుంచీ తక్షణ ఉపశమనం
Health Tips | నల్ల క్యారెట్లతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..?
Health Tips | ప్రతి చిన్న పనికి అలసిపోతున్నారా.. అయితే మీ కూరల్లో ఇది తప్పక ఉండాల్సిందే
Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే భయపడుతున్నారా.. అయితే మీరు ఇది చదవాల్సిందే
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

