Health Tips | మండే ఎండలకు తాళలేక పోతున్నారా.. అయితే ఇవి కలిపిన పానీయాలు తప్పక తాగండి..
Health Tips | వేసవి వచ్చిందంటే జనానికి అవస్థలు తప్పవు. ఇంట్లోనే ఉంటే ఉక్కపోతకు తడిసిపోవాలి. బయటికి వస్తే ఎండలకు మండిపోవాలి. ఏం చేయాలన్న చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే తల ప్రాణం తోకకు వస్తుంది.
వేసవి (Summer) వచ్చిందంటే జనానికి అవస్థలు తప్పవు. ఇంట్లోనే ఉంటే ఉక్కపోతకు తడిసిపోవాలి. బయటికి వస్తే ఎండలకు మండిపోవాలి. ఏం చేయాలన్న చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే తల ప్రాణం తోకకు వస్తుంది. ఈ మండే ఎండలకు తోడు వడ గాడ్పులు కూడా దడ పుట్టిస్తుంటాయి. ఎండల తీవ్రతవల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దాంతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంది. అయితే, ఈ సమస్యలకు సబ్జా గింజలు (Sabja seeds) చక్కని పరిష్కారం చూపుతాయి. మరి సబ్జా గింజలను ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసుకుందామా..
ఇలా తీసుకుందాం..
1. ఒంట్లో చల్లదనాన్ని పెంచడమేగాక, ఆరోగ్యాన్ని కాపాడే సబ్జా గింజలను వేసవి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే, ఈ సబ్జా గింజలను నేరుగా తినలేం. కాబట్టి ఇతర పానీయాలతో కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
2. సాధారణంగా అయితే సజ్జా గింజలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి, తర్వాత వాటిని పెరుగు, మజ్జిగ, షర్బత్, మిల్క్‌షేక్ లాంటి నచ్చిన పానీయంలో కలుపుకుని తాగాలి.
3. పెరుగు, మజ్జిగ, షర్బత్ లాంటివి నచ్చకపోతే బాగా నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో వేసి కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకుని కూడా తాగొచ్చు.
సబ్జా షికంజీ షెర్బత్..
అంతేగాక సబ్జా గింజలతో సబ్జా షికంజీ షెర్బత్ చేసుకుని కూడా తాగుతారు. ఒక పెద్ద గాజు జార్లో కొన్ని ఐస్ ముక్కలు వేసి, కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నానబెట్టిన సబ్జా గింజలు, నీళ్లు పోసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా పెరుగు, కొన్ని నీళ్లు పోసి మళ్లీ కలుపాలి. అంతే చల్లచల్లని సబ్జా షికంజీ షెర్బత్ రెడీ అవుతుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips | కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఇవి ట్రై చేయండి!
Health Tips | సగ్గు బియ్యంతో చాలా లాభాలున్నాయ్.. వేసవి తాపం నుంచీ తక్షణ ఉపశమనం
Health Tips | నల్ల క్యారెట్లతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..?
Health Tips | ప్రతి చిన్న పనికి అలసిపోతున్నారా.. అయితే మీ కూరల్లో ఇది తప్పక ఉండాల్సిందే
Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

