Health Tips | మీలో ఈ కింది లక్షణాల్లో ఏవైనా కనిపిస్తున్నాయా.. అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి
Health Tips | చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని మొదట్లోనే గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్ వచ్చే ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ సమస్య విస్తరిస్తున్నది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నవారు పెరిగిపోతున్నారు. మన దేశంలో అయితే ఈ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. అయితే చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని మొదట్లోనే గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్ వచ్చే ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
డయాబెటిస్ వచ్చే ముందు మనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులు కనిపించే దశనే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారు. అయితే అన్ని మార్పులు అందరిలో కనిపించవు. కొందరిలో కొన్ని రకాల మార్పులు, మరికొందరిలో మరికొన్ని రకాల మార్పులు ఉంటాయి. ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో కనిపించే ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రీ డయాబెటిక్ స్టేజ్ సింప్టమ్స్..
ఎ. విపరీతంగా జుట్టు రాలుతుంది. ఉన్నట్టుండి జట్టు రాలే సమస్య ఎక్కువైందంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
బి. ఊరికనే అలసిపోతారు. సాధారణంగా ఏదైనా శారీరక శ్రమ కలిగించే పనిచేస్తే మనుషులు అలసిపోతారు. కానీ, ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఏ పని చేయకపోయినా రోజంతా అలసటగా ఉంటుంది.
సి. చర్మంపై మచ్చలు వస్తాయి. కొంత మందిలో షుగర్ సమస్య వచ్చే ముందు చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. అలా మచ్చలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించాలి.
డి. తరచూ మూత్ర విసర్జన అవుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో లేకపోతే మూత్ర విసర్జన అధికంగా ఉంటుంది. ఈ లక్షణం కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోనే కనిపిస్తుంది.
ఈ. వీటితోపాటే కొందరిలో తీవ్ర తలనొప్పి, మరికొందరిలో చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, ఇంకొందరిలో అరికాళ్లలో మంటలు పుట్టడం లాంటి లక్షణాలు ప్రీ డయాబెటిక్ దశలో కనిపిస్తాయి. కొంతమంది నోరు ఎండుకపోయి నాలుక తడారినట్లు అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips | డయాబెటిక్ రోగులు కార్న్ ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏమవుతుంది..?
Health Tips | మండే ఎండలకు తాళలేక పోతున్నారా.. అయితే ఇవి కలిపిన పానీయాలు తప్పక తాగండి..
Health Tips | కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఇవి ట్రై చేయండి!
Health Tips | సగ్గు బియ్యంతో చాలా లాభాలున్నాయ్.. వేసవి తాపం నుంచీ తక్షణ ఉపశమనం
Health Tips | నల్ల క్యారెట్లతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

