Health tips | రోజూ నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. ఎంతవరకు నిజం..?
Health tips | నెయ్యి అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ, నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది ఊబకాయం వస్తుందనే భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి తినడంవల్ల బరువు పెరుగుతారా..?
నెయ్యి అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ, నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది ఊబకాయం వస్తుందనే భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి తినడంవల్ల బరువు పెరుగుతారా..? అందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా..? అంటే లేవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదంతా వట్టి అపోహేనని కొట్టిపారేస్తున్నారు. అయితే, అతిగా కాకుండా రోజూ మితంగా నెయ్యి తీసుకోవడంవల్ల బరువు తగ్గవచ్చంటున్నారు. రోజుకు 1 నుంచి 2 టీ స్పూన్లకు మించకుండా నెయ్యి తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
శక్తిని ఉత్పత్తి చేసే పవర్ హౌస్
రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండవచ్చు. నెయ్యి శక్తిని ఉత్పత్తిచేసే ఒక పవర్‌హౌస్ లాంటిది. అందుకే మహిళలకు గర్భధారణ సమయంలో నెయ్యి తినాల్సిందిగా సూచిస్తారు.
చర్మానికి నిగారింపు
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను లాక్ చేయడం ద్వారా ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంలో నిగారింపు, ఆరోగ్యకరమైన చర్మం పొందాలంటే ఆహారంలో రోజూ నెయ్యిని కలుపుకోవాల్సిందే.
పీరియడ్స్ సమస్యకు చెక్
శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాక బాధపడే మహిళలు ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎముకలకు బలం
నెయ్యిలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. అది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. తద్వారా దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health tips | రోజూ నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. ఎంతవరకు నిజం..?
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Cucumber | ఎండాకాలంలో దొరికే కీరదోసను తొక్క తీసి తినడం మంచిదేనా?
Health Tips | మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారా.. అయితే ఈ పండు మీకు చక్కటి పరిష్కారం..!
Health Tips | నిమ్మకాయతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం.. ఎలాగో తెలుసా..?
Health tips | వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెటర్.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

