మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Komarambheem - Sep 16, 2020 , 03:10:25

రైతు బాంధవుడు కేసీఆర్‌

రైతు బాంధవుడు కేసీఆర్‌

  • n అనేక పథకాలకు రూపకల్పన
  • n ఆర్థికంగా బలోపేతమవుతున్న అన్నదాత
  • n టీఆర్‌ఎస్‌ నిర్మల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్‌
  • n నూతన రెవెన్యూ చట్టంపై హర్షం
  • n పార్డి(బీ), దొంగచింత గ్రామాల్లో  సీఎం చిత్రపటం, ఫ్లెక్సీలకు రైతులు, ఆదివాసుల పాలాభిషేకం
  • n గుడిహత్నూర్‌లో వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో..

కుభీర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బాంధవుడని, వారి కోసం అనేక పథకాలకు రూపకల్పన చేశారని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్‌ అన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టంపై హర్షిస్తూ.. మండలంలోని పార్డి(బీ) పంచాయతీ ఆవరణలో మంగళవారం వందలాది మంది రైతులు, గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, యువకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున కేసీఆర్‌ జిందాబాద్‌.. జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తూం రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను మించిన నాయకులెవరూ లేరని అభివర్ణించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ తుకారాం, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు శేరి సురేశ్‌, నాయకులు ఏ బాబు, వడ్ల లక్ష్మణ్‌, మిలింద్‌, మడి రమేశ్‌, యకీనొద్దీన్‌, అమ్జత్‌, శేరి భోజన్న, శంకర్‌, శివన్న, మారుతి, కీని శంకర్‌, నారాయణ, రైతులు పాల్గొన్నారు.  

ఆదివాసుల హర్షం..

ఉట్నూర్‌ రూరల్‌: మండలంలోని దొంగచింత గ్రామంలో ఆదివాసీ రైతులతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లా జీవవైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు, ప్రజలకు మేలు జరిగేలా నూతన చట్టాలు, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం శుభపరిణామమన్నారు. ఆదివాసులు సాగుచేస్తున్న ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములపై అధికారాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక పోర్టల్‌ కేటాయించడం వల్ల హక్కు పత్రాలున్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ జుగదిరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో..

గుడిహత్నూర్‌ : తహసీల్‌  కార్యాలయ ఆవరణలో వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని సంఘం మండలాధ్యక్షుడు పుండలిక్‌ అన్నారు. వీఆర్‌ఏలకు సంఘీభావంగా ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్‌, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు జీ తిరుమల్‌గౌడ్‌ కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జాదవ్‌ గోవింద్‌, వీఆర్‌ఏల సంఘం ఉపాధ్యక్షుడు బాలాజీ, నాయకులు రాజన్న, లస్మన్న, అడెల్లు, బర్కత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.


logo