e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home కొమరంభీం రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బీ వెంకటి
జైనూర్‌ పీఏసీఎస్‌లో ఎరువుల గోదాముల పరిశీలన

జైనూర్‌, జూన్‌ 9 : రైతులకు ఎరువుల పంపిణీలో ఇబ్బందులు కలుగకుండా చూడాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బీ వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో నిల్వ ఉంచిన ఎరువుల గోదాములను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలన్నారు. మండలంలోని విత్తనాల దుకాణాల నిర్వహణపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్‌కుమార్‌, ఏఈవోలు, సహకార సంఘం కార్యదర్శి తదితరులున్నారు.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు..
కాగజ్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 9 : మండలంలోని అందుబాటులో ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం ప్రారంభమవడంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాలను సరిపడా అందజేసిందన్నారు. డీఏపీ 60 మెట్రిక్‌ టన్నులు, 20-20 కాంప్లెక్స్‌ 40 మెట్రిక్‌ టన్నులు, యూరియా 200 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే వరి ధాన్యం 5 మెట్రిక్‌ టన్నులు, కందులు, అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పట్టా పాస్‌పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు పీఏసీఎస్‌లో అందజేసి, ఎరువులు, విత్తనాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్‌, ఏఈవో యువరాణి, రోహిణి, అసిస్టెంట్‌ సీఈవో సతీశ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

ట్రెండింగ్‌

Advertisement