ఏజెన్సీ మండలాలపై ప్రత్యేక దృష్టి
త్వరలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే
పల్లెల్లో వైద్య శిబిరాల ఏర్పాటు
ఇప్పటికే అందుబాటులో మందులు, సిబ్బంది
కళాకారులతో చైతన్య కార్యక్రమాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల పలుచోట్ల వానలు పడ్డాయి. దీంతో గతంలో వ్యాధులు ప్రబలిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సా రించనున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలు సిర్పూర్-(యూ), లింగాపూర్, జైనూర్, కెరమెరి, తిర్యాణిలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు.
సమన్వయంతో ముందుకు..
వ్యాధుల నియంత్రణకు వైద్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, ము న్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయనున్నారు. జూన్, జూలై, ఆగస్టులో ఇంటింటా సర్వేతో పాటు వైద్య శిబిరాలను ఏ ర్పాటు చేయనున్నారు. గతంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదైన బొంబాయిగూడ, పెంచికల్పేట్, దహెగాం గ్రామా ల్లో మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం నిరం తరం పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. అంతేగాకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి సరఫరా పైపులైన్‌కు లీకేజీ ఉంటే వెంటనే మరమ్మతలు చేపట్టనున్నారు. ఇ ప్పటికే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయాశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పక డ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కళాజాత బృందాలతో చైతన్య కార్యక్రమాలు..
సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించనున్నా రు. సిర్పూర్-(యూ), లింగాపూర్, జైనూర్, కెరమెరి, తిర్యా ణి మండలాల్లోని గిరి గ్రామాల్లో కళా ప్రదర్శనలు ఇవ్వ నున్నారు. పారిశుధ్యం, పరిశుభ్రత, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా గిరిజనులు మూఢనమ్మకాల బారిన పడకుండా వారిని చైతన్యవంతులను చేయనున్నారు.
సరిపడా మందులు..
మారుమూల గ్రామాల్లో వైద్య సేవలను అందించేందుకు ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులతోపాటు, వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచారు. వ్యా ధులు సోకినట్లు గుర్తించిన వెంటనే శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు, మందులను అందించనున్నారు. సిర్పూర్-(యూ), లింగాపూర్, జైనూర్, కెరమెరి, తిర్యాణి మండలాల్లోని గిరి గ్రామాల్లో పనిచేసే ఆశ కార్యకర్తలు మొదలు కొని వైద్యాధికారి వరకు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు.