పోలింగ్ ప్రక్రియను పరిశీలించాలి..
పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా అన్నారు. మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పా టు చేశారు.
- ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్
ఎదులాపురం, మే 8 : పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా అన్నారు. మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకుడు మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు, నిశీతంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. మాక్ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాలదారులు, మాక్ పోల్ అనంతనం చేపట్టే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా? లేదా? అని పరిశీలన చేయాలన్నా రు.
ఈ అంశాలపై జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సీక్రెట్ పోలింగ్ కంపార్టెంట్ ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయక పోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారో పరిశీలన చేయాలన్నారు. పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని, మైక్రో అబ్జర్వర్స్ శిక్షణలో అన్ని అంశాలపై అవగాహన కల్పించుకుని ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. మాక్ పోల్ ఉదయం 5.30గంటలకు ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి రాజర్షి షా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన 190 మంది మైక్రో అబ్జర్వర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రెయినర్ లక్ష్మణ్ మైక్రో అబ్జర్వర్స్కు అవగాహన కల్పించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువు పెంపు
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఈసీ ఈనెల 10 తేదీ వరకు గడువు పెంచిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఉండగా 10వ తే దీ వరకు అవకాశం కల్పించిందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

