Theerthala sangameshwara Swamy Jathara | ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అంచలంచెలుగా పెరిగిన భక్తుల తాకిడికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో ఖమ్మం నుండి ఆమంచికల్ మీదుగా తీర్థాలకు చేరుకునే ప్రధాన రహదారి , పల్లెగూడెం నుంచి తీర్థాలకు వచ్చే రహదారిపై వందలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. దీంతో గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే ఉండిపోయారు. ఉదయం వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే సమయం కావడం.. సుదూర ప్రాంతాల నుంచి దేవాలయానికి వచ్చే భక్తులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి.
పోలీస్ సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల ట్రాఫిక్ నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు భక్తులు కాలినడకన దేవాలయానికి వచ్చిన సందర్భాలు కనిపించాయి.
SLBC Tunnel Mishap | చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. సొరంగంలోకి ఉత్తరాఖండ్ టీం
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్‌రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు