Illegal Soil Business | మధిర, మార్చి 06 : రియల్ ఎస్టేటర్లు యథేచ్చగా అక్రమ మట్టి దందా చేస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరించటం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మధిర- దెందుకూరు ప్రధాన మార్గం పక్కనే గల ఓ వెంచర్లో రియల్ ఎస్టేటర్లు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. వెంచర్ల కోసం ఎటువంటి అనుమతులు లేకుండానే ఎర్రుపాలెం మండలం నుంచి మధిర మండలానికి టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మట్టి తరలించడానికి అనుమతులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కూడా రెవెన్యూ, పోలీస్ ,మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేసి పరిశీలించవలసి ఉన్నది.
కానీ ఈ మండలంలో మాత్రం ఓ మట్టి మాఫియాకు సంబంధించిన వ్యక్తికి అన్ని అనుమతులు ఉన్నాయని అధికారులే చెప్పడం విశేషం. మట్టి తరలించి అనుమతులు పొందిన వ్యక్తికి ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి అవసరము. అవసరం మేరకు తరలించుకున్నాడా.. లేదా..? అక్రమంగా మట్టి తరలిస్తున్నాడా..? అన్న విషయాన్ని మాత్రం అధికారులు తనిఖీ చేయడం లేదని తెలుస్తుంది. వాస్తవంగా ఇటీవల మండలంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మట్టి అవసరం ఉంటే దానికి అనుమతులు తీసుకొని తరలించవచ్చు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఒక క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వానికి రూ. 20 చెల్లించి వారి అవసరాల మేరకు మట్టిని తరలించకపోవచ్చు. కానీ అలా చేయకుండా ఒక అనుమతితో ఎక్కడికి పడితే అక్కడికి ఈ మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ వనరులను కొల్లగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
అడ్డగోలుగా అక్రమంగా వందలాది టిప్పర్లతో మట్టి తరలించకపోతుంటే అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అక్రమంగా మట్టి తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేయాలని కోరుతున్నారు.
మట్టి తరలింపుపై తహసీల్దార్ రాచబండి రాంబాబును వివరణ కోరగా.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు నుంచి ఈ మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. వారికి అనుమతులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మట్టి తరలించే వ్యక్తికి ప్రభుత్వ పనులుకే కాకుండా ప్రైవేట్ పనులు కోసం కూడా ఎక్కడికైనా మట్టిని తోడుకునే అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు