Vaccine | బోనకల్లు : వ్యాధుల నివారణ కోసం ఇచ్చే వ్యాక్సిన్ ను బెనిఫిషర్కు తప్పనిసరిగా వేయాలని డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ లాజిస్టిక్ మేనేజర్ (DVLM) రమణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న టీకాల కార్యక్రమం (రోటీన్ ఇమ్యునైజేషన్) ను తనిఖీ చేశారు. అదేవిధంగా పీహెచ్సీలో ముష్టికుంట్ల సబ్ సెంటర్ నందు ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
వ్యాక్సిన్‌కు సంబంధించి రికార్డులను వ్యాక్సిన్ పొటెన్సీ వివిఎంలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సంబంధమైన నేషనల్ ప్రోగ్రాంలకు సంబంధించి ప్రతీ రికార్డును అప్డేట్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు వ్యాక్సిన్ కొరకు వచ్చిన బెనిఫిషరీతో మాట్లాడి వారికి వేసిన టీకాలు ఏ విధంగా పని చేస్తాయో అన్న విషయాన్ని తెలియజేయాలన్నారు. గ్రోత్ చార్ట్‌ను ప్రతి నెల బిడ్డ ఎదుగుదలను రికార్డ్ చేసి తక్కువ బరువు ఉన్న వారిని మెడికల్ ఆఫీసర్ వద్దకు పంపవలసిందిగా ఏఎన్ఎంలను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, ఇంచార్జ్ సిహెచ్ఓ దానయ్య ముష్టికుంట్ల సబ్ సెంటర్ ఏఎన్ఎంలు ఆశాలు , అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Castor Oil In Navel | బొడ్డులో ఆముదం వేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?