Madhira Bridge | మధిర, ఫిబ్రవరి 20 : మధిర నియోజకవర్గంలోని బోనకల్లు-నాగులవంచ, చిరుమర్రి-వనం వారికి కృష్ణాపురం ప్రధాన రోడ్డు మార్గాలలో నిర్మాణ పనులు రెండేళ్లయినా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతూ వారి గమ్యాలకు చేరుకునే పరిస్థితి నెలకొంది.
ఖమ్మం నుంచి ఏపీలోని విజయవాడకు వెళ్లేందుకు వయా బోనకల్లు మీదుగా ఒక రోడ్డు, అదేవిధంగా ఖమ్మం నుంచి వయా ముదిగొండ వల్లభి మీదుగా జగ్గయ్యపేట వరకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం గతంలో ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేశారు. ఈ క్రమంలో ఈ రోడ్డు మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఈ మార్గంలో చింతకాని మండలం నాగలవంచ గ్రామం వద్ద ముదిగొండ మండలం చిరుమర్రి-వనం వారి కృష్ణాపురం మధ్య ఉన్న రోడ్డు మార్గంలో వాగుల వద్ద వరదనీటి కోసం ఆనాడు లో లెవెల్ కాజువేలను నిర్మించారు. వర్షాకాలంలో వరద నీటి కారణంగా ఈ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయేవి. ఈ సమస్యను అధిగమించటం కోసం ఆర్ అండ్ బి అధికారులు ఈ రెండు చోట్ల ఒక్కొక్క బ్రిడ్జి నిర్మాణాల కోసం రూ.56 లక్షలు నిధులను మంజూరు చేశారు.
కాంట్రాక్టర్ పనులను వదిలేసే పరిస్థితి..
రెండేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణ పనులు తగ్గించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టి నిర్మాణాలను పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. అంతేకాకుండా తాత్కాలికంగా బ్రిడ్జి నిర్మాణ పనుల ప్రాంతంలో అప్రోచ్ రోడ్డును తూతూ మంత్రంగా వేయడం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముదిగొండ మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జి పిల్లర్లకే నిర్మాణ పనులు పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్ ఇక్కడ పనులను వదిలేసే పరిస్థితి ఏర్పడింది.
నాగలవంచ దగ్గర బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో రాకపోకలు సాగించడానికి కష్టతరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటని వాహనదారుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదా..? అధికారుల పర్యవేక్షణ కొరవైందా ..? కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అన్న విషయంపై జిల్లా అధికారులు దృష్టి సారించి నిర్మాణ పనులు వేగవంతం చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!