ముత్తారం, మే 29 : ఖమ్మం జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రోజుల నుండి కనుబడుట లేదని ముత్తారం ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు. గ్రామానికి చెందిన ఎల్లయ్య వృత్తి రీత్యా గీతకార్మికుడు. కాగా, ఈ నెల 26 వ తేదిన కల్లు గీసేందుకు వెళ్తానని చెప్పి వెళ్లి ఇంటికి రాలేదని.. తన నాన్న ఆచూకీ కనుక్కోని తమకు అప్పగించాలని కోరుతూ ఎల్లయ్య కుమారుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Sircilla | ఇంత ఇసంపోసి పో.. ఎన్నికలప్పుడు ఎనెన్ని చెప్పినవ్.. రేవంత్‌పై రైతు నరసవ్వ ఆక్రోశం