Irrigation Water | బోనకల్, మార్చి 04 : రైతులు సాగు చేసిన చివరి భూముల వరకు సాగర్ జలాలను సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నుంచి కాలువల ద్వారా విడుదలవుతున్న సాగునీటిని పంట పొలాలకు అందేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ఐదో విడత సాగర జలాల విడుదల జరుగుతుందని.. ఈ జలాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రైతులకు ఏ మేరకు సాగునీరు అవసరం ఉందో వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు గుర్తించి పంటల అవసరాల మేరకు సాగునీరు సరఫరా చేయాలన్నారు. రైతాంగం సాగునీటిని వృధా చేయకుండా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
మండలంలో స్థలాల క్రమబద్దీకరణ కోసం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అర్హతలు పొందిన దరఖాస్తులను త్వరగా గుర్తించాలన్నారు. ఈ నెల 31 లోపు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖలు క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్కు సంబంధించిన దరఖాస్తులు పరిశీలన చేయాలన్నారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఎంపీడీవో రురావత్ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్, ఇరిగేషన్ ఏఈలు రాజేష్, ఏడుకొండలు, ఆర్ఐలు గుగులోతు లక్ష్మణ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు