జూలూరుపాడు,ఫిబ్రవరి 14 : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ( TUCI) జిల్లా మహాసభలను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు కోరారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో హమాలీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వెంగన్నపాలెం గ్రామపంచాయతీ వర్కర్లను కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి బానోత్ ధనవంతరావు, తంబర్ల లక్ష్మి, సోడె నరసింహారావు, బూరం నరసింహారావు, దొడ్డ ఉదయ్ కుమార్, కాలం ప్రశాంత్, తాటి నవీన్, కల్తీ సాయి, దబ్బా వెంకన్న, బొప్పిరెడ్డి వంశీ, శ్రీనివాసరావు, ఖాసిం, సునీత, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
MS Narayana | ఎంఎస్ నారాయణ చివరి క్షణంలో నన్ను చూడాలి అనుకున్నాడు : బ్రహ్మానందం
TG High Court | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్