కవాడిగూడ, ఫిబ్రవరి 24 : అక్షర చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితులకు న్యా యం చేయాలని పలువు రు వక్తలు డిమాండ్ చేశా రు. అక్షర చిట్‌ఫండ్, అక్ష ర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ఆర్థిక మోసాలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చిట్‌ఫండ్ కంపెనీల బాధితుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సంఘం గౌరవాధ్యక్షురాలు పశ్యపద్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ..పరిపాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన ఉందో లేదో తెలియడంలేదన్నారు. ఆర్టీసీలో యూనియన్లు ఉండకూడదు అనేదాని వెనుక కుట్ర ఉందన్నారు. ప్రైవేటు వారిని నింపాలన్న దురుద్దేశం ఉందని అన్నారు.
అగ్రిగోల్డ్, అక్షర చిట్‌ఫండ్ సంస్థలు వైట్ కాలర్ మోసాలు కుంభకోణాలపై సమగ్రమైన విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మొగులయ్య, ప్రధాన కార్యదర్శి అరుణ, విజయలక్ష్మి, జగన్మోహన్రెడ్డి, కొండారెడ్డి, లలిత, బాధితులు పాల్గొన్నారు.