Brahmanandam – MS Narayana | దివంగత నటుడు, కమెడియన్ ఎంఎస్ నారాయణ చివరి క్షణాలను తొలిసారి మీడియా ముందు పంచుకున్నాడు హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam).
ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. షూటింగ్ సమయాల్లో కూడా నన్ను అన్నయ్య అంటూ పిలిచేవాడు. అతడిని చూస్తే ఒక మేధావి, ఒక తెలివైన వాడు బెడ్ మీద ఉండి చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు అనిపించింది. తన చివరి క్షణాలలో ఎన్నో మెదడులో తిరుగుతుంటాయి. ఎంతోమంది ప్రముఖులు తెలుసు అతడికి. బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. కానీ, వారందరూ ఉన్నప్పటికీ చివరి క్షణాల్లో నన్ను చూడాలని అనుకున్నాడు. బెడ్‌పై ఉండి నోటితో మాట్లాడలేని కండిషన్లో ఉండి కూడా తన కూతురికి సైగ చేసి కాగీతం అడిగి.. ఆ కాగీతంలో బ్రహ్మనందం అన్నయ్యను చూడాలని ఉందని రాశాడు. దీంతో వెంటనే ఎంఎస్ కూతురు నాకు కాల్ చేసింది. నేను అప్పుడు గోపిచంద్ సినిమా (ఆరడుగుల బుల్లెట్) షూటింగ్ శంషాబాద్ జరుగుతుంటే అక్కడ ఉన్నాను. ఈ విషయం తెలియగానే ఎవరికి చెప్పకుండా షూటింగ్ మధ్యలోనే ఆసుపత్రికి వచ్చాను.
ఎంఎస్ నారాయణ నన్ను చూడగానే తన రెండు కండ్ల నుంచి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణాన్ని నేను మర్చిపోలేను. అతడిని కలిసిన తర్వాత డాక్టర్ని ఎంత ఖర్చు అయిన పర్వాలేదు బ్రతికించండి అని వేడుకున్నాను. ఆ తర్వాత కుటుంబసభ్యులతో మాట్లాడి మళ్లీ షూటింగ్‌కి బయలుదేరా. ఈ మధ్య దారిలో ఉండగానే.. తను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి అంటూ చెప్పుకోచ్చాడు బ్రహ్మి.