KTR | కేటీఆర్, పువ్వాడ అజయ్ చొరవతో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపన
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును విస్తరించి, రైతులకు అధిక ఆదాయం కల్పించడం, దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టింది. రైతులు పండించిన పంటలను సమయానికి కొనుగోలు చేసి ప్రాసెస్ చేయడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.
KTR | ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపనకు మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఆనాడే చొరవ తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రూ.300 కోట్ల పెట్టుబడితో గోద్రేజ్ గ్రూప్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో శ్రీకారం చుట్టి మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును విస్తరించి, రైతులకు అధిక ఆదాయం కల్పించడం, దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టింది. రైతులు పండించిన పంటలను సమయానికి కొనుగోలు చేసి ప్రాసెస్ చేయడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. అప్పటి కృషి ఫలితంగా ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ అగ్రోవెట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు అయింది. గోద్రేజ్ అగ్రోవెట్తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి రైతులకు మార్కెట్, ఉపాధి అవకాశాలు పెంచాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు అప్పటి మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు శంకుస్థాపన చేశారు.
మిషన్ మోడ్‌లో విస్తరించే లక్ష్యంతో ప్రణాళికలు..
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును మిషన్ మోడ్‌లో విస్తరించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. రైతులకు పరిశ్రమలతో అనుసంధానం కల్పించే విధానాన్ని అనుసరించింది ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పెట్టుబడులను ప్రోత్సహించింది. తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం రైతుల ఆదాయాన్ని పెంచడం వంటనూనెల దిగుమతులపై దేశ ఆధారాన్ని తగ్గించడం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడం వంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా కృషి చేసింది. భారతదేశం తినే వంటనూనెలలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, దేశీయ ఆయిల్ పామ్ ఉత్పత్తి పెరగడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించి ఆహార నూనెల స్వయం సమృద్ధి లక్ష్యానికి ఈ తరహా ప్రాజెక్టుల స్థాపనకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటు అందించింది.
ఆయిల్ పామ్ రంగానికి బీఆర్ఎస్ బలమైన పునాది : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతులకు సమీపంలో ప్రాసెసింగ్ సౌకర్యాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో పని చేసి ఆయిల్ పామ్ రంగానికి బలమైన పునాది వేశాం. తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడం కొరకు ఖమ్మం జిల్లాలో ఈ గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపనకు కృషి చేశాం.
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

