Urea | రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతులు (Farmers) నానా అవస్థలు పడుతున్నారు. సొసైటీ కార్యాలయాల ముందు టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఖమ్మం (Khammam) జిల్లా కారేపల్లిలో యూరియా కోసం రైతులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం కార్యాలయం, జిన్నింగ్ మిల్లు ప్రాంగణంలో యూరియా బస్తాల పంపిణీ కొరకు కూపన్లు ఇస్తున్నారనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిలోమీటర్ల మేర బారులు తీరారు (Long Queue). కూపన్ల కోసం రైతులంతా ఒక్కసారిగా మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్ చుట్టూ గుమిగూడడంతో ఏవో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన అధికారులు ఏవోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరోవైపు తెల్లవారుజామున నుంచి యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Grand Nursery Mela | నెక్లెస్ రోడ్లో గ్రాండ్ నర్సరీ మేళా.. అందుబాటులో అరుదైన మొక్కలు, విత్తనాలు