Defected MLAs | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షురూ.. ఆ ఆరుగురికి మరోసారి నోటీసులు పంపిన స్పీకర్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) విచారణకు అసెంబ్లీ స్పీకర్ ట్రయల్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసులు పంపించారు.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) విచారణకు అసెంబ్లీ స్పీకర్ ట్రయల్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసులు పంపించారు. పార్టీ మార్పునకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని కోరారు. నోటీసులు అందుకున్నవారిలో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు.
కాగా, ఈ ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో పంపిన నోటీసులకు ఇప్పటికే సమాధానాలు ఇచ్చారు. అయితే వాటికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి గత సోమవారం రీజాయిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నరు.. మేము తప్పించుకోలేమా? అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నరు. ఇకడ తప్పించుకున్నా కోర్టు ముందు వీరు తప్పించుకోలేరు. వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలు తీర్పు చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

