KCR Birthday | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సార్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.. రైతులకు మంచి రోజులు రావాలని కోరుతూ ఓ గిరిజన రైతు తాను పండించిన పంటతోనే కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం కస్మా తండాకు చెందిన భాస్కర్ ఇవాళ కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇతర గ్రామ రైతులతో కలిసి మిర్చి కల్లాల్లో ఎండుమిర్చి పంటతో హ్యాపీ బర్త్ డే అక్షరాలను తీర్చిదిద్ది తన అభిమానం చాటుకున్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తనకు జరిగిన మేలును కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెట్టారు. ప్రతీ రైతు కుటుంబం కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని కచ్చితంగా రైతుల కోసం కేసీఆర్ సీఎంగా వచ్చి తీరుతాడని భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్