Crops Digital Survey | మధిర, ఫిబ్రవరి 19 : ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు రైతులు సాగు చేస్తున్న పంటల డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు చేస్తున్న డిజిటల్ సర్వేని మధిర వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయచంద్ర పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు యాసంగి సాగులో డిజిటల్ సర్వే ద్వారా పంటల సాగు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఏ పంటలు సాగు చేశారో.. వారికి వ్యవసాయ శాఖ వారు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి పంటను నమోదు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ పకడ్బందీగా పంట నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏఈఓలు పంట నమోదు ఎటువంటి పొరపాట్లు లేకుండా చేయాలని.. తద్వారా రైతులు పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్‌ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కనకం సాయిదీక్షిత్ , వ్యవసాయ విస్తరణ అధికారులు అమృత, జిష్ణు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Warangal | కేంద్రం బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ