CPM | మధిర : పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటే ఉద్యమం నిర్వహిస్తామని సీపీఎం (CPM) పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించిన హిందు స్మశాన వాటిక స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ.. పట్టణంలో రెవెన్యూ అధికారులు ఇటీవల స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని దాని హద్దులను గుర్తించటం కోసం సర్వే నిర్వహించారన్నారు.
దానిలో భాగంగా స్మశాన వాటిక సరిహద్దులను సక్రమంగా గుర్తించకుండా.. పై అధికారుల హెచ్చరికతో ఒక్క రోజులో స్మశాన వాటిక సర్వే నిర్వహించి పూర్తి చేయడమేమిటి అని ప్రశ్నించారు. దీనివలన హద్దులను సక్రమంగా గుర్తించకుండా సర్వే ని నిర్వహించడం వల్ల సర్వే సక్రమంగా జరగలేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారని తెలిపారు. 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యకాలం నుండి జీవిస్తున్న ఆ ప్రాంత ప్రజలు స్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించారని రెవెన్యూ అధికారులు వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.
కానీ వాస్తవంగా ఆ ప్రాంత ప్రజలు స్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించలేదని, ఇవి వారి సొంత స్థలాలని 30 సంవత్సరాల క్రితం గజం 10 రూపాయల చొప్పున ఆనాడు కొనుగోలు చేసుకుని కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సమగ్ర భూ సర్వే నిర్వహించి, ఏ ప్రాంతంలో ఆక్రమణ జరిగిందో అని గుర్తించి ఆ ప్రాంతం నుండి భూమిని రికవరీ చేయాలన్నారు. 40 సంవత్సరాల నుండి నివసిస్తున్న అమాయక పేద ప్రజల స్థలాలను లాక్కోవద్దని, అట్లా లాక్కుంటే వారికి అండదండగా సిపిఎం పార్టీ ఉంటుందని తెలియజేశారు.
ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పడకండి మురళి, డివిజన్ కమిటీ సభ్యులు పాపినేని రామ నర్సయ్య, భవనగిరి నారాయణ, గోపి ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
Manchireddy Kishan Reddy | దమ్ముంటే రైతులకు ఫార్మాసిటీ భూములిప్పించండి : మంచిరెడ్డి కిషన్రెడ్డి
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు