Mirchi Crop | ఖమ్మం రూరల్ : మిర్చి పంటల (Mirchi Crops)కు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా అన్నారు. ఇవాళ ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ముత్తగూడెంలో రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ.. వడ్డీలు తెచ్చి.. పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ రైతు కష్టాన్ని వ్యాపారులు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గ సభ్యుడు మిడ కంటి చిన్న వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరంలో క్వింటాల్ ధర రూ.25 వేలు పలికినప్పుడు నేడు రూ.9 వేలు, రూ. 10 వేలు, రూ.11వేలకు పడిపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది అధికారులు, దళారులు కలిసి చేస్తున్న నాటకంగా కనిపిస్తుందన్నారు. ఈ వ్యవహారాలను నిరసిస్తూ మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని నేటి ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని మిర్చి మార్కెట్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని.. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బానోతు రాంకోటి, ఎడ్లపల్లి శంకరయ్య ,సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, రైతు సంఘం ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు మామిడి శంకర్ రెడ్డి, వెన్నం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
KCR | కేసీఆర్ జన్మదినం వేళ వినూత్న సేవ.. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..