గోదావరిఖని : రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఉద్యమ నేత కేసీఆర్ జన్మదినం(KCR birth day) సందర్భంగా వినూత్నంగా సేవ కార్యక్రమాలు చేపట్టి వండర్ బుక్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కేసీఆర్ 71 వ జన్మదినం సందర్భంగా మెడికల్ కళాశాల ప్రభుత్వ దవాఖానలో 71 మందితో రక్తదాన శిబిరం చేపట్టారు. అదే విధంగా 71 మెక్కలు పంపిణీ చేశారు. అలాగే 71 మందికి సింగరేణి రిటైర్డ్ కార్మికులను సన్మానించి వండర్ బుక్ రికార్డు చోటు సాధించినట్లు ప్రకటించారు.
ఈ సర్టిఫికెట్ను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కో ఆర్డినేటర్ నుంచి అందుకున్నారు. అంతకుముందు కేసీఆర్ జన్మదినం(KCR birthday) సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెక్కలను పంపిణీ చేశారు. ఈశ్వర కృషి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. జయదుర్గదేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.