Irrigation Water | బోనకల్, ఫిబ్రవరి 24 : పంటలకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ బోనకల్ వద్ద వైరా-జగ్గయ్యపేట రోడ్డు మార్గంలో ఇవాళ రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు చింతల చెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్ఎస్పీ అధికారులు వారబందీ పెట్టడం వల్ల చివర ఉన్న మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదన్నారు.
ఎన్ఎస్పీ అధికారులు వెంటనే స్పందించి వారబందీ ఎత్తివేసి చివరి భూముల వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి రైతులు నిర్వహిస్తున్న ధర్నా వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేఈ రాజేష్ మాట్లాడుతూ.. నారాయణపురం గ్రామ పరిసర ప్రాంత చివరి పంట పొలాలకు సాగర్ నీళ్లు ఇబ్బందులేకుండా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను ఉప సంహరించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేష్, కూచిపూడి మురళి, కోట నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బంధం శ్రీనివాసరావు, ఉప్పర శ్రీను, గిరిజన సంఘం నాయకులు గుగులోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!