రుద్రంపూర్, జూలై 11 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు ఏరియా మహిళ కెమిస్ట్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కెమిస్టులు, కార్మికులు మాట్లాడుతూ CMOAI చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవన్నారు. అధికారులు చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలకు కార్మికులందరి పూర్తి మద్దతు ఉంటుందని, వారి న్యాయమైన కోరికలు ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై గట్టయ్య, మొగిలిపాక రవి, పూర్ణచంద్రరావు, సింగర్ శ్రీనివాస్ రావు, కెరీన్, దివ్యశ్రీ పాల్గొన్నారు.