– ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట భారీ ధర్నా
రామవరం, నవంబర్ 08 : కమిటీల పేరుతో సింగరేణి యాజమాన్యం కాలయాపన చేయవద్దని, కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో జిఎం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా, ముట్టడి కార్యక్రమాన్ని బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జీఎం షాలెం రాజుకు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యంగా మెడికల్ బోర్డు 6 నెలల నుండి నిర్వహించకపోవడం వల్ల కార్మికులు అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం చేయలేక పోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు.
సొంత ఇంటి పథకం, మారుపేర్ల సమస్య, పేర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కోలిండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలన్నారు. అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా విడుదల చేసిన 150 మస్టర్ల సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలన్నారు. మెడికల్ అన్‌ఫిట్ అయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగ నియామక ప్రత్రాలు ఇవ్వాలన్నారు. వీకే కోల్ మైన్‌లో పర్మినెంట్ ఉద్యోగులతోనే బొగ్గు వెలికితీత తియ్యాలని డిమాండ్ చేశారు, ఏఐటీయూసీ నిత్యం కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కులు సాధించడంలో ముందుంటుందన్నారు.
అదేవిధంగా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వరరావు, క్రిస్టోఫర్, సామల రాము, పిట్ కార్యదర్శిలు మధుకృష్ణ, కమల్, సుధీర్, సురేందర్, సౌజన్య, సీనియర్ నాయకులు కత్తర్ల రాములు, రాజాలపూడి సాంబమూర్తి, సురేందర్, సురేశ్, మింగిన్ రవి, బండి వెంకటరమణ, కర్రు రమేశ్, మెంగన్ రవి, కోటి, మురళి, గుమ్మడి, ఓం ప్రకాశ్, సాయిపవన్, భుక్య రమేశ్, బండి వెంకటరమణ, బండారి మల్లయ్య, రాజేశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.

Ramavaram : కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెనుకాడబోం : మిరియాల రంగయ్య