ఇల్లెందు, సెప్టెంబర్ 24 : ఆదివాసి భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులదేనని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం సాహితీ డిగ్రీ కళాశాలలో టి ఏ జి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసి గిరిజన సాంస్కృతిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసి ఉపాధ్యాయులు సేకరించిన 150 రకాల అడవి విత్తనాల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివాసి సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఆదివాసీలపై ఉందన్నారు. అలాగే విత్తన ప్రదర్శన మంచి కార్యక్రమం అని, నిర్వాహకులను అభినందించారు.