చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం రైసుపేట గ్రామానికి చెందిన నామాల శ్రీనివాసరావు కుమార్తె నామాల భవిష్య చిన్నతనం నుంచి చదువులో రాణిస్తుంది. ఇంజినీరింగ్లో గోల్డ్మెడల్ సాధించి తానేమిటో నిరూపించింది. మన్యంలో పుట్టి గోల్డుమెడల్ సాధించిన తొలి ఆడబిడ్డ నామాల భవిష్యను పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. భవిష్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ దీవిస్తున్నారు.