బూర్గంపహాడ్, అక్టోబర్ 1 : అభివృద్ధి, సంక్షేమ పథకాల కు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో నకిరిపేట కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారందరికీ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు సంక్షేమ ఫలా లు అందుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమన్నారు. సంక్షేమ పథకాలన్నీ సజావుగా అందాలంటే మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నారు.
దేశంలో ఎక్క డా లేనివిధంగా సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రజలు కేసీఆర్ను మరోసారి ఆదరించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ఉపసర్పంచ్ బోళ్ల వెంకన్న, నాయకుడు కామిరెడ్డి రామకొండారెడ్డి, సాయిబాబా, బాలాజీ, కొనకంచి శ్రీ ను, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.