Ramavaram : క్రీడా పోటీల నిర్వహణలో లోటు లేకుండా చూడాలి : జీఎం శాలెం రాజు
నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్లో నిర్వహిస్తున్నకబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరలా మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవల్ క్రీడా పోటీలను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు.
రామవరం, నవంబర్ 20 : నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్లో నిర్వహిస్తున్నకబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరలా మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవల్ క్రీడా పోటీలను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కోసం జరుగుతున్న పనులను గురువారం ఆయన సమీక్షించారు. ఈ వార్షిక సంవత్సరం 2025-26లో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కొత్తగూడెం ఏరియాలో నిర్వహించుటకు నిర్ణయించడమైంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కాలనీలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ నందు ప్లే గ్రౌండ్, క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం(ఈ &ఎం) ఏరియా వర్క్ షాప్ జె. క్రిస్టఫర్, డివైఎస్ఈ (సివిల్) కె.రాజా రామారావు, ఇతర అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరుగుతుందని, అందుకు కావలసిన పనులను ఏమాత్రం అలసత్వం లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, డివైఎస్ఈ (ఈ&ఎం) టి.అనిల్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ బి.భీముడు, స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ బి.వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ సీహెచ్.సాగర్, మహేశ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

