రామవరం, నవంబర్ 24 : కార్మికులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ నందు నిరసన తెలిపి మెమొరాండలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ట్రేడ్ యూనియన్లని కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సింగరేణి సంస్థను మెల్లగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తుందని దుయ్యబట్టారు. కార్మికులను 12 గంటలు పని చేయిస్తూ బడా పెట్టుబడిదారులను పెంచి పోషిస్తుందని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయకపోతే నిర్వధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సహాయ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ గడప రాజయ్య, బోరింగ్ శంకర్, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.వీరాస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, హీరాలాల్, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శిలు హుమాయూన్, మధుకృష్ణ, కమల్, ఏం ఆర్ కే ప్రసాద్, సీనియర్ నాయకులు రాజపూడి సాంబమూర్తి, సురేందర్, మాచర్ల శ్రీనివాస్, జడల ప్రకాశ్, మురళి, భుక్య రమేశ్, సాయి పవన్, బండి వెంకటరమణ, వినయ్, పడాల కృష్ణ, సుబ్రమణ్యం, అవినాష్, దీక్షిత్, మెయిన్, అప్పారావు పాల్గొన్నారు.