– పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుని పని చేస్తున్నారు
– కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో ఎంపీ వద్దిరాజు
భద్రాద్రి కొత్తగూడెం. ఫిబ్రవరి 06 : తెలంగాణ రాష్ట్రం దొంగల చేతుల్లోకి పోయిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 60వ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని, కాంగ్రెస్ కండవాలు కప్పి కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీ నాయకులను సమానంగా చూడటమే పోలీసుల విధులని, అలా లేకుండా కేవలం బీఆర్ఎస్ అభ్యర్థులపై కక్షగట్టి వార్డుల్లో పని చేయకుండా చేస్తున్నారన్నారు. 60వ వార్డులో పోటీ చేస్తున్న బీమా శ్రీవల్లి శ్రీధర్ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తనదేనన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా విజయం బీఆర్ఎస్దే అన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాకుండా ప్రజా వేదనగా ఉందన్నారు. ఈ ప్రచారంలో భీమా శ్రీవల్లి. శ్రీధర్, అందె కొమరయ్య, నాయకులు పాల్గొన్నారు.