Kothagudem | సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీబీజీకేఎస్ సిద్ధం..

మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వనని చెప్పడం, బోర్డు ఏర్పాటు చేయకపోవడం యాజమాన్యం తప్పిదమే కానీ కార్మికులదో, వారి కుటుంబ సభ్యులదో కాదన్నారు. అదేవిధంగా డిపెండెంట్ ఉద్యోగంలో కుటుంబ సభ్యులందరి సంతకం కావాలనడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిని టీబీజీకేఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదన్నారు. ఇది పూర్తిగా ఆ మాజీ కార్మికుడి ఇష్టానుసారం జరగాలన్నారు.
కార్మికుల సమస్యలపై డిసెంబర్ 31న కీలక ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై చర్చలు జరుగుతున్న సమయంలో జాతీయ పార్టీలు తమను కూడా చర్చలకు పిలవాలని ఆర్ఎల్సీకి లేఖ రాయడం విచిత్రంగా ఉందన్నారు. జాతీయ సంఘాలు ప్రవర్తిస్తున్న తీరును కార్మికులు గుర్తించాలన్నారు. సింగరేణి కార్మికులకు ఓ ప్రైవేట్ బ్యాంకు జీతభత్యాలు పడితే ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా ప్రమాద బీమాలో భాగంగా కార్మికుడికి రూ.40-50లక్షలు, కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.15-20లక్షలు ఇచ్చే విధంగా అంగీకారం తెలిపాయని, ఇదే విషయంపై యాజమాన్యంతో చర్చిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రవూఫ్, నాయకులు వీరభద్రం, కోటా శ్రీనివాసరావు, కాపాశివాజీ, వర్మ, బుర్రా వెంకటేశ్వర్లు, టంగుటూరుశ్రీను తదితరులున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

