Sri Sitaramula Kalyanam | ఆళ్లపల్లి ఏప్రిల్ 6 : ఆళ్లపల్లి, మర్కోడు గ్రామాల్లోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆళ్లపల్లిలో నరెడ్ల ప్రవీణ్ సరిత, వనపర్తి ప్రశాంత్ , మర్కోడులో మోదుగుదుంపురం దయాకర్ చారి – లక్ష్మీ ప్రసన్న, అనుమోల అచ్యుత్ కృష్ణ – అనుష దంపతులు స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా కళ్యాణాన్ని జరిపించారు.
మర్కోడులో రణం నారాయణ, తాళ్లపల్లి రామ్మూర్తి, వెలిశాల రామ్మూర్తి ,అనుమోల వెంకటేశ్వరరావు, తాటికొండ వెంకటాచారి, పొదిల రాము, తాళ్లపల్లి నాగేశ్వరరావు, వగలబోయిన సతీష్, తాళ్లపల్లి నవీన్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆళ్లపల్లిలో కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు.
టెంట్ హౌస్ కొంపెల్లి సాంబయ్య, యా సారపు సతీష్ భక్తులకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, సాంబయ్య, శ్రీనివాసచారి, శ్రీకాంత్, సాగర్, అన్వేష్, వేణు, సతీష్, పవన్, సాయి, నరేష్, రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.