రామవరం, సెప్టెంబర్ 02 : కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చార్జి జి.వీరాస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి యాజమాన్యం ఈఎస్ఐ హాస్పిటల్ ను నిర్మించి కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు, ప్రతి నెల కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.26 వేలు తగ్గకుండా వేతనం చెల్లించాలన్నారు.
సమావేశంలో కొత్తగూడెం ఏరియాలో ఉన్న పలు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద జీఎం ను కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా ఏఐటీయూసీ ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఏరియా సహాయ బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య, సివిల్ పిట్ కార్యదర్శి సందబోయిన శ్రీనివాస్, డిపార్ట్మెంట్ సలహాదారుడు కొవ్వురీ రాజేశ్వరరావు, పిట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాళ్లూరి నాగేశ్వరరావు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.